కరోనా-కొన్ని పాఠాలు

సమాజం పట్ల బాధ్యత: విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధం కింద వుండాలి అని చెప్పినా పాటించని కొంత మంది వలన ఈ రోజు జిల్లాలు, రాష్ట్రాలు, దేశం గృహ నిర్బంధం లోకి వెళ్ళాల్సి వస్తుంది. సమాజం లో వున్నప్పుడు మనం కూడా సమాజం పట్ల భాద్యత వహించాల్సిందే.
 
జన్యు పరమైన విషయాల్లో సంక్లిష్టత: కరోనా ఒక వైరస్. తనకు తానూ బ్రతకలేని, జీవానికి, జీవం లేని వాటికి మధ్యలో వుండే ఒక పదార్ధం. జీవ పదార్దాలు ఎంత తొందరగా రూపాంతరం చెందుతాయో, ఎంత తొందరగా వ్యాప్తి చెందుతాయో, ఎంత ప్రమాదకరంగా పరిగానమిస్తాయో ‘కరోన’ ఉదంతం తెలియ చేస్తుంది. ఎక్కడో చైనా దేశం లో ఒక మారు మూల పట్టణం లో ప్రారంభం ఐన ప్రస్తుత వైరస్ కొద్ది రోజుల్లో కమ్మేసింది. కాబట్టి జన్యు పరమైన అంశాలతో ముడిపడిన విషయాలలో కొంచెం జాగ్రతగా వుంటే మంచది.
 
క్లిష్టమైన సమస్యకు పరష్కారం క్లిష్టంగా వుండక్కరలేదు: నిజానికి కరోనా ఒక రేస్పిరేటరి (ఉదరకోశ) వ్యాధి కలిగించే వైరస్. తుమ్మినప్పుడు లేక దగ్గినప్పుడు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. చాలా చిన్న జాగ్రతలు దీని వ్యాప్తిని అరికడుతుంది. ఈ జబ్బు వచ్చిన వాళ్ళు మిగితా వాళ్ళతో కలవకుండా, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మిగితా వాళ్ళకు సమస్య రాకుండా నోటికి, ముక్కుకు అడ్డు పెట్టుకోవటం (ఇది ఎవరికైనా మంచిది..మామూలుగా కూడా ఎన్నో వైరస్ లు మనం ప్రతిసారి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎదుట వాళ్ళకు వెళ్తుంటాయి) వలన వ్యాప్తి అరికట్ట వచ్చు. ఈ వైరస్ గాలిలో కాని ఇతర వస్తువుల పైన కాని కొన్ని గంటలే ఉండగలుగుతుంది. ఒక వేళ ఆ సమయం లో పొరపాటున చేతులకు అంటినా, మొహం మీద, ముక్కుకు చేతులు తగలకుండా చూసుకోవచ్చు. వైరస్ పైన ప్రోటీన్, ఫాట్ కోటింగ్ వుంటుంది. మామూలు సబ్బు తో కాని, ఆల్కహాల్ తో కాని కడుక్కుంటే పైన కోటింగ్ పోవటం వలన అది నిర్వీర్యం అయిపోతుంది. అర్ధం అయ్యేలా చెప్తే, అర్ధం చేసుకుంటే పరిష్కారం చిన్నదే.
 
పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థ అవసరం: ఎలాంటి తీవ్రమైన జబ్బు అయినా చాలా మాటికి ముందు జాగ్రతలు తీసుకోవటం, ప్రేవెంటివ్ కేర్ తీసుకోవటం మీద ఆధార పడి వుంటుంది. ప్రైవేటు రంగం లో పెరుతున్న ఆసుపత్రులన్ని కురేటివ్, అంటే జబ్బు వచ్చిన తర్వాత మందులతోనో, ఆపరేషన్ తోనో తగ్గించటానికి/నయం చేయమీదనే ద్రుష్టి పెడుతున్నాయి. అందుకే ఒక పటిష్టమైన ప్రజారోగ వ్యవస్థ అవసరం.
 
శాస్త్రీయ దృక్పధం: ఆవు మూత్రం పరిష్కారం అనే సాంప్రదాయవాదులు గాని తమకు తెలిసిన ఆధునిక సైన్సు లో అన్నిటికి పరిష్కారాలు వున్నాయి అనేవాళ్ళు ఇద్దరు తప్పులే చేస్తున్నారు. ఎప్పుడు ఎదురైన సమస్యలకు పరిష్కారం వెతుక్కోవటానికి మానవాళి ప్రయత్నం చేస్తునీ వుంటుంది. అయితే అప్పటి కాలమాన పరిస్తితులు ఆ పరిష్కారాలను కూడా ప్రభావితం చేస్తాయి అన్న విషయం మనం మరవకూడదు. వెయ్యి సంవత్సరాల క్రితం అన్నిటిని మతం ప్రభావితం చేస్తే…ఈ రోజు..అన్నిటిని వ్యాపారం ప్రభావితం చేస్తుంది. రెండిటిలో సమస్యలు అర్ధం చేసుకోవాలి, ఈనాటికి ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఆయా పరిష్కారాలను ఎలా వాడుకుంటాం అనే ఆలోచన చేయాలి. దీనికి శాస్త్రీయ దృక్పధం అవసరం. మతం పాటించే వాళ్ళంతా మత ఛందస వాదులు కానట్టే…సైన్సు చదువుకున్నా, ప్రాక్టీసు చేస్తున్న వాళ్ళంతా శాస్త్రీయ దృక్పధం తో ఏమి వ్యవహరించటం లేదు. అదే వుంటే ఈ రోజు రసాయనాలు, అంటి బయాటిక్ రేసిస్తేన్సు, కాలుష్యం, వాతావరణం లో మార్పులు లాంటి సమస్యలు మనం చూసే వాళ్ళం కాదు.